ఖాళీ బిందెలతో మహిళల నిరసన

News

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలంలోని అక్కపల్లి గ్రామంలో సోమవారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత ఏడాదిగా నల్లాలు రాక మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని , తమ దయనీయ పరిస్థితిని గురించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. పలుమార్లు సర్పంచ్‌కు విన్నవించినా ఇప్పటి వరకు స్పందన లేదని, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు మంచినీరు అందే విధంగా చూడాలని కోరారు. ఈ ఆందోళనలో బావ్‌ లక్ష్మి, పోసవ్వ, లత, రేణుక, దేవలక్ష్మి, సత్తవ్వ, శ్యామల, రేణుక, లక్ష్మీ, శారద తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *