ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించిన పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి

 ఈరోజు కురిసిన వర్షానికి ముంపునకు గురైన 34,35,37,38 వార్డులోని ప్రాంతాలను గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు సందర్శించడం జరిగింది… ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ నేడు కురిసిన వర్షానికి ముంపునకు గురైన వివిధ ప్రాంతాలను సందర్శించడం జరిగింది అని అన్నారు..
వివిధ ప్రాంతాలలో వర్షం కురిసిన అప్పుడల్లా వర్షపు నీరు మురికి నీరు మురికి కాలువ నుండి అధిక మొత్తంలో ప్రవహించడం ద్వారా మురికి కాలువలు సరిగా లేక ఆ నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు..


అదేవిధంగా పట్టణ ప్రధాన కాలువా అయిన ఉదర వాగు దెబ్బ తినడం వల్ల కూడా నీటి ప్రవాహంకు ఇబ్బందులు ఏర్పడి ఉదర వాగు పరిసర ప్రాంతాలు ప్రతి వర్షాకాలంలోనూ ముంపునకు గురవుతున్న విషయాన్ని స్థానిక కౌన్సిలర్ మరియు మేము గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి దృష్టికి ఇట్టి సమస్యను తీసుకెళ్లగా వారు ఉదర కాలువ పునర్నిర్మాణానికి ప్రత్యేకంగా 6 కోట్ల 21 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది ఇట్టి నిర్మాణానికి సంబంధించిన వర్క్ ఆర్డర్ కోసం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది త్వరలోనే నూతన కాలువ నిర్మాణం చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు..
అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు పట్టణ అభివృద్ధిలో భాగంగా మొదటి విడతలో కేటాయించిన 15 కోట్ల రూపాయలు నిధులను వార్డులలో ఆయా కౌన్సిలర్ల ద్వారా మురికి కాల్వల అవసరాన్ని గుర్తించి అవసరం ఉన్న చోట మురికి కాల్వల నిర్మాణం కు అధికశాతం నిధులు కేటాయించి నూతన మురికి కాలువల నిర్మాణం చేపట్టి ఇళ్లలోకి మీరు చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.. అదేవిధంగా కొంత మంది ప్రజలు అవగాహన లోపంతో మురికి నీటి కాలువలో ప్లాస్టిక్ వస్తువులు మొదలగు సామాగ్రిని పడవేయడం ద్వారా కూడా మురికి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ఇళ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉందని గ్రహించి పారిశుద్ధ్య అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందని అన్నారు..


ప్రజలు ఎవరూ కూడా మురికినీటి కాలువల్లో ప్లాస్టిక్ తదితర వస్తువులు వేయకూడదని ప్రజలకు సూచించారు..
మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి గారి వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య గారు, కౌన్సిలర్ సభ్యులు దార్ల కీర్తన సందీప్ గారు, దూస వినయ్ గారు,దిడ్డి మాధవి రాజుగారు, గూడూరి భాస్కర్ గారు, మున్సిపల్ అధికారులు సిబ్బంది మరియు ఆయా వార్డు ప్రజలు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *