వెంకటాపూర్‌లో భూ సమగ్ర సర్వే ప్రారంభం..

News

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో బుధవారం అధికారులు భూ సమగ్ర సర్వేను ప్రారంభించారు. డిసెంబర్‌ 04వ తేదీ వరకు జరిగే ఈ సర్వేలో రైతులు ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు ఉన్న రైతులు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని అక్కడికక్కడే పరిష్కరించనున్నట్లు తెలిపారు. చనిపోయిన పట్టాదారుల వారసులకు పట్టాలు చేయడం, ఆన్‌లైన్‌లో లేనివారి భూములను నమోదు చేయడం, పేర్ల సవరణ చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ పొన్నాల మంజుల సూచించారు. ఈ కార్యక్రమంలో టీం లీడర్‌ హన్మంతుగౌడ్‌, వీఆర్వోలు బాలరాజు, రమేష్‌, దేవయ్య, రామకృష్ణ, తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్‌, నాయకులు దీకొండ సునిల్‌, పొన్నాల మల్లారెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *