సిద్దిపేటలో కూలిన హెలీకాప్టర్

News
 

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ శివారులో ఓ హెలీ కాప్టర్‌ కూలిపోయింది. ల్యాండ్‌ అవుతున్న సమయంలో హెలీకాప్టర్‌లో మంటలు చెలరేగాయి. అయినప్పటికీ పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. పారాచూట్ల సాయంతో వారు కిందకు దిగి ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకోలిగారు.

హకీంపేట నుంచి వస్తున్న ఈ శిక్షణా హెలీకాప్టర్‌ గాలిలోనే పేలినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్సనిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.

పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *