రక్తదానం చేసి జిల్లా ప్రజల మనస్సు గెలిచిన ఎస్ పి

News

సంక్షేమ కార్యక్రమాలు లలో ముందు ఉండే సిరిసిల్ల జిల్లా SP శ్రీ విశ్వజిత్ కాంపాటి గారు మరోసారి జిల్లా ప్రజల మనస్సు గెలిచారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఈరోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా స్థాయిలో రక్త దాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో 140 మంది పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి SP గారి చేతుల మీదుగా సెర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ముందుగా SP గారు, మరియు 17 Bn కమాండెంట్ రమేష్ బాబు గారు కార్యక్రమన్ని ప్రారంభించారు. SP గారు, కమాండెంట్ గారు, సిరిసిల్ల టౌన్ రూరల్ ఎల్లారెడ్డిపేట CI లు, SI లు కూడా రక్త దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. పలువురు మీడియా సోదరులు కూడా రక్త దాననికి ముందుకు రావడంతో SP గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా SP గారు మాట్లాడుతూ వారోత్సవాలలో భాగంగా పలు సంక్షేమ కార్యక్రమలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కటి సమాజానికి ఏదో విధంగా ఉపయోగ పడేలా ఉండే కార్యక్రమాలు చేపడుతున్నాం అని, రక్త దానం వల్ల ఒకరి ప్రాణం నిలిపిన వారిమి అవుతాము అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *