హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక సాయం : ఎస్ పి విశ్వజిత్

News

రాజన్న సిరిసిల్ల జిల్లా లోని గంభీరావుపేట్ కి చెందిన బండ శ్రీనివాస్(35) HG-1262 గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు, అనారోగ్య కారణాల వల్ల 03-10-2017 న అకాల మరణం చెందాడు. అతనికి భార్య రుక్మిణి , ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయిన ఆ కుటుంబానికి SP  విశ్వజిత్  వెంటనే పలు ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు అందించారు.ఈ మధ్యన జిల్లాలో  ఏర్పాటు చేసిన హోంగార్డుల సంక్షేమ సహాయ నిధి నుండి 20,000/- రూపాయలు  అందజేసారు. సహోద్యోగా హోంగార్డు లందరు తమ తమ ఒక్క రోజు వేతనాన్ని 94,400/- చెక్కు ని కూడా ఇవ్వడం అభినందనీయం. SP గారూ చేయించిన భీమా పాలసీ మరణానంతరం రావలసిన భీమా సదుపాయాలు పై ప్రత్యేక దృష్టి తో పర్యవేక్షించగా 2,00,000 రూపాయలు భీమా సంబంధిత డబ్బులు మంజూరు కాగా ఈరోజు SP గారూ బండ శ్రీనివాస్ భార్య రుక్మిణి కి ఈరోజు అందజేసి, కుటుంబానికి వీలైనంత సహాయం చేయటంలో ఎపుడు ముందు ఉంటామని , ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయాన్ని తొందరలో అందేలా చూస్తామని తెలిపారు.

SP విశ్వజిత్ జిల్లా హోంగార్డుల భద్రత, రక్షణ కోసంచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి, హోంగార్డు ల కుటుంబాలకు భద్రత, భరోసా, ఆసరా ని ఇస్తున్నాయి. రాష్ట్రం లో ఎక్కడ లేని విధంగా SP జీవిత భీమా పాలసీ లు అన్నింటిని స్వయంగా పరీక్షించి, భీమా భద్రత గల పాలసీ ని ప్రత్యేక చొరవతో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 242 మంది హోంగార్డ్స్ కి జీవిత భీమా చేయించిన విషయం విదితమే. అయితే ఆ సంక్షేమ కార్యక్రమ ఫలాలు ఇపుడు ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయిన ఒక కుటుంబానికి ఆసరాగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో AR అడ్మిన్ RI శశిధర్ గారు, HG CC షేక్ బాషా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *