Inauguration of PLANT AMBULANCE by Collector Krishna Bhaskar and Municipal Chairman Jindam Kala Chakrapani at Sricilla

గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్లాంట్ అంబులెన్స్ ను ప్రారంభించి…. ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి.. లక్ష మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈరోజు తెలంగాణకు హరిత హారంలో భాగంగా పురపాలక సంఘ పరిధి లోని విలీన గ్రామం అయినటువంటి 12వ వార్డ్ చంద్రంపేట లో లక్ష మొక్కల పంపిణీ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమాలతో పాటు మొక్కలు సంరక్షణ కొరకు ప్లాంట్ అంబులెన్స్ ను కూడా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు పురపాలక సంఘ చైర్ పర్సన్ గార్ల చే ప్రారంభించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మునిసిపల్ కమీషనర్ గారు మాట్లాడుతూ ఈరోజు ప్రారంభించిన ప్లాంట్ అంబులెన్స్ ను పూర్తిగా మొక్కల సంరక్షణకు మాత్రమే ఉపయోగించబడును అని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరిస్తూ సిరిసిల్ల పురపాలక సంఘ పరిధిలో నాటిన మొక్కలు సంరక్షించుటకు మరియు క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ (చనిపోయిన లేదా వాడి పోయిన మొక్కలు మార్చుటకు గాను) గాను వినూత్న పద్దతిలో సిరిసిల్ల పురపాలక సంఘం “ప్లాంట్ అంబులెన్స్ “ ఏర్పాటు చేయడం జరిగినది, ఇట్టి అంబులెన్స్ లో ట్రీ గార్డ్స్, సపోర్ట్ స్టిక్స్, ఎరువులు , పారలు, తట్టలు, మొదలగు పరికరాలు ఏర్పాటు చేయనైనది అలాగే వాటర్ సౌకర్యము కలదు. ఇట్టి అంబులెన్స్ ముఖ్య ఉద్దేశ్యం పట్టణంలోని వివిధ వార్డులలోని చని పోయిన మొక్కల స్థానంలో క్రొత్త మొక్కలు ఏర్పాటు, మొక్కలకు పాదులు చేయుట, ట్రీ గార్డ్స్ లేని చోట ట్రీ గార్డ్స్ ఏర్పాటు, పెరిగిన చెట్లకు ట్రీ గార్డ్స్ ను తొలగించుట, గుబురుగా పెరిగిన మొక్కలను ట్రిమ్మింగ్ చేయుట, ఎరువులు వేయుట మొదలగు పనులు చేయబడును అని తెలియజేశారు.మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావున పట్టణ ప్రజలు మొక్కల విషయమై ఎలాంటి ఫిర్యాదులు అనగా మీ యొక్క వార్డులలోని ఎవైన మొక్కలు చెడిపోయిన, గుబురుగా పెరిగిన, ట్రీ గార్డ్స్ లేకున్నా కావున, పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా మీ యొక్క వార్డులలోని ఎవైన మొక్కలు చెడిపోయిన, గుబురుగా పెరిగిన, ట్రీ గార్డ్స్ లేకున్నా మా యొక్క అంబులెన్స్ నెంబర్ 08723-233040 కి కాల్ చేస్తే మా యొక్క అంబులెన్స్ టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉండగలరు దీనికి గాను అంబులెన్స్ టీం లో ఒక డ్రైవర్ మరియు నలుగురు వర్కర్ లను నియమించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు,స్ధానిక సంస్థల ఆడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ గారు, చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి గారు,వైస్ ఛైర్మన్ మంచే శ్రీనివాస్ గారు, స్థానిక కౌన్సిలర్స్ పాతూరి రాజిరెడ్డి గారు, పోచవేని సత్య-ఎల్లయ్య గారు,కౌన్సిల్ సభ్యులు,కో ఆప్షన్ సభ్యులు, స్థానిక ప్రజలు, మెప్మా సిబ్బంది మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు -జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే IPS గారు

నాణ్యత లాంటి సాకులతో తుకంలో మోసాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం
రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేయడానికి సంబంధిత అధికారులతో టాస్క్ ఫోర్స్ బృధాలు ఏర్పాటు

జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే IPS గారు

ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
గత కొద్ది రోజులుగా నాణ్యత సరిగా లేదని, ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉన్నదని, తాలు, మట్టి ఎక్కువ ఉన్నదని రైతులు తీసుకువస్తున్న ధాన్యానికి మద్దతు ధర చెల్లించకుండా క్వింటాలుకు మూడు నుండి నాలుగు కిలోలను తగ్గిస్తున్నట్లుగా రైతుల వద్ద నుండి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యం నాణ్యత లేకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ధాన్యాన్ని పరిశీలించిన తర్వాత నిర్ణయించిన విధంగా ధర చెల్లించాలని తెలిపారు. అలా కాకుండా నాణ్యత, మాయిశ్చర్, తాలు సాకుగా క్వింటాలుకు కొన్ని కిలోలను తగ్గింపు లాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేయడంతో పాటు సంబందిత మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
సంబంధిత అధికారులతో టాస్క్ ఫోర్స్ బృధాలు ఏర్పాటు
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రైతాంగం మోస పోకుండా ఉందడం లక్ష్యంగా పోలీస్, రెవిన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్, తూనికలు, కొలతల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డిఎస్పీ రవికుమార్ ఇంచార్జ్ గా సిరిసిల్ల సబ్ డివిసన్ మరియు వేములవాడ సబ్ డివిసన్ లలో రెండు టీమ్స్ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తాయని జిల్లా ఎస్పీ గారు చెప్పారు.
ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరిగినా, రైతాంగానికి అన్యాయం జరిగేలా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు జరిగినా, మోసం చేసేందుకు ప్రయతించినా, తూకం, మాయిశ్చర్ విషయంలో అడ్డగోలుగా వ్యవహరించినా రైతులు నేరుగా డయల్ 100కు కానీ6303 922572కు వాట్స్ అప్, ఎస్.ఎం.ఎస్. ద్వారా లేదా 7901124613 కు సమాచారం ఇవ్వాలని ఆయన రైతులను కోరారు. సమాచారం వచ్చిన వెంటనే స్పందించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, రైతాంగానికి జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ అండగా నిలుస్తుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు..

ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ గారు,రవికుమార్ గారు,DRDO -కౌటిల్య గారు,DAO -రణధీర్ రెడ్డి,Civil Supply Officer – జితేందర్ రెడ్డి,
DCO – బుద్ధనాయుడు,Legal Metrology Officer – రవీందర్,స్పెషల్ బ్రాంచ్ సి.ఐ సర్వర్ గారు పాల్గొన్నారు…

ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించిన పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి

 ఈరోజు కురిసిన వర్షానికి ముంపునకు గురైన 34,35,37,38 వార్డులోని ప్రాంతాలను గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు సందర్శించడం జరిగింది… ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ నేడు కురిసిన వర్షానికి ముంపునకు గురైన వివిధ ప్రాంతాలను సందర్శించడం జరిగింది అని అన్నారు..
వివిధ ప్రాంతాలలో వర్షం కురిసిన అప్పుడల్లా వర్షపు నీరు మురికి నీరు మురికి కాలువ నుండి అధిక మొత్తంలో ప్రవహించడం ద్వారా మురికి కాలువలు సరిగా లేక ఆ నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు..


అదేవిధంగా పట్టణ ప్రధాన కాలువా అయిన ఉదర వాగు దెబ్బ తినడం వల్ల కూడా నీటి ప్రవాహంకు ఇబ్బందులు ఏర్పడి ఉదర వాగు పరిసర ప్రాంతాలు ప్రతి వర్షాకాలంలోనూ ముంపునకు గురవుతున్న విషయాన్ని స్థానిక కౌన్సిలర్ మరియు మేము గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి దృష్టికి ఇట్టి సమస్యను తీసుకెళ్లగా వారు ఉదర కాలువ పునర్నిర్మాణానికి ప్రత్యేకంగా 6 కోట్ల 21 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది ఇట్టి నిర్మాణానికి సంబంధించిన వర్క్ ఆర్డర్ కోసం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది త్వరలోనే నూతన కాలువ నిర్మాణం చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు..
అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు పట్టణ అభివృద్ధిలో భాగంగా మొదటి విడతలో కేటాయించిన 15 కోట్ల రూపాయలు నిధులను వార్డులలో ఆయా కౌన్సిలర్ల ద్వారా మురికి కాల్వల అవసరాన్ని గుర్తించి అవసరం ఉన్న చోట మురికి కాల్వల నిర్మాణం కు అధికశాతం నిధులు కేటాయించి నూతన మురికి కాలువల నిర్మాణం చేపట్టి ఇళ్లలోకి మీరు చేరకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.. అదేవిధంగా కొంత మంది ప్రజలు అవగాహన లోపంతో మురికి నీటి కాలువలో ప్లాస్టిక్ వస్తువులు మొదలగు సామాగ్రిని పడవేయడం ద్వారా కూడా మురికి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ఇళ్లలోకి నీరు చేరే ప్రమాదం ఉందని గ్రహించి పారిశుద్ధ్య అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేయడం జరిగిందని అన్నారు..


ప్రజలు ఎవరూ కూడా మురికినీటి కాలువల్లో ప్లాస్టిక్ తదితర వస్తువులు వేయకూడదని ప్రజలకు సూచించారు..
మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి గారి వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య గారు, కౌన్సిలర్ సభ్యులు దార్ల కీర్తన సందీప్ గారు, దూస వినయ్ గారు,దిడ్డి మాధవి రాజుగారు, గూడూరి భాస్కర్ గారు, మున్సిపల్ అధికారులు సిబ్బంది మరియు ఆయా వార్డు ప్రజలు ఉన్నారు