Sircilla street vendors avails P. M. Aathma Nirbhar fund.

గౌరవనీయులైన భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు స్ట్రీట్ వెండర్స్ కోసం జూన్ 1వ తేది 2020 రోజున ప్రారంభించబడిన పి ఎం ఆత్మ నిర్భర నిధి (స్వానిధి) పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికీ లబ్ది చేకూర్చడం లో సిరిసిల్ల మునిసిపాలిటి జాతీయ స్థాయిలో లక్ష లోపు జనాభా గల 3555 పట్టణాలకు గాను సిరిసిల్ల మునిసిపాలిటీలలో మొదటి స్థానం లో నిలవడం జరిగింది. ఈ సందర్భంగా మునిసిపల్ కమీషనర్ మరియు పి డి మెప్మా సమ్మయ్య గారు మాట్లాడుతూ పట్టణం లోని పూర్తి జనాభా లో 5శాతం స్ట్రీట్ వెండర్స్ కు ఈ పథకం కింద లబ్ది చేకూర్చేలనే లక్ష్యం తో సిరిసిల్ల పట్టణం లోని 6680 స్ట్రీట్ వెండర్స్ లను గుర్తించి వారికీ గుర్తింపు కార్డులను మంజూరు చేయడం జరిగింది వీరిలో 5935 మంది పి ఎం ఆత్మ నిర్భర నిధి కింద లోన్స్ కి దరఖాస్తు చేశారు వీరిలో ఇప్పటివరకు 4968 మందికి 10,000/- రూ. లు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయబడినది అని తెలియజేయడం జరిగింది.ఈ యొక్క లక్ష్యాన్ని చేరడానికి మెప్మా అర్ పి లు ,కమ్యూనిటీ ఆర్గనైజర్ లు మరియు వార్డ్ ఆఫీసర్స్ తో స్ట్రీట్ వెండర్స్ ను గుర్తించటం ,ఆన్లైన్ లో నమోదు చేయడం , అర్హులకు లోన్స్ మంజూరు చేయటం కోసం స్పెషల్ టీం లను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. దీనికి కృషి చేసినటువంటి అర్ పి లకు, మెప్మా సిబ్బందికి మరియు మునిసిపల్ కార్యాలయ సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసారు