గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం లో బాగంగా వికలాంగులకు స్కూటీ ల పంపిణీ

గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా వారు చేపట్టిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణానికి చెందిన దివ్యాంగులకు త్రి చక్ర మోటార్ వాహనాల (స్కూటీ ల) పంపిణీ కార్యక్రమం గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారి, జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య గారి, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ గారి మరియు తెరాస పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి గారి చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది..
ఈ సందర్భంగా తెరాస పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి గారు మాట్లాడుతూ…. గౌరవ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు వారి పుట్టినరోజు సందర్భంగా గత సంవత్సరం కరోనా కష్టకాలంలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఆరు అంబులెన్సులను ప్రభుత్వ వైద్యశాలకు అందజేశారు..
వారి ప్రకటన అనంతరం అనేక మంది ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి వారు కూడా అంబులెన్సులను ప్రభుత్వ వైద్యశాలకు అందజేయడం జరిగిందని గుర్తు చేశారు…
అదే విధంగా ఈ సంవత్సరం గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు తన పుట్టిన రోజు సందర్భంగా దివ్యాంగ సోదరులకు ఉపయోగపడేలా త్రి చక్ర మోటార్ వాహనాలను (స్కూటీ) లను అందజేస్తానని ప్రకటించగానే అనేక మంది ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి సుమారు వెయ్యికి పైగా త్రిచక్ర మోటార్ వాహనాలను (స్కూటీ లను) అందజేస్తున్నారు..
ఇలా అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు తన పుట్టిన రోజు పేరుతో ఏలాంటి ఆర్భాటాలకు పోకుండా వారి పుట్టినరోజు సందర్భంగా కూడా ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని అన్నారు…
సిరిసిల్ల నియోజకవర్గంలో దివ్యాంగ సోదరులకు సుమారు 125 అందులో సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలో 25 త్రిచక్ర మోటార్ వాహనాలను (స్కూటీ లను) అందిస్తున్న గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
అనుక్షణం ప్రజా సంక్షేమం ఆలోచించే తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వంలో పని చేస్తున్నందుకు మేమెంతో గర్వపడుతున్నామని అన్నారు..
దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్ర రావు గారు మరియు లబ్ధిదారులు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు వారి జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు త్రి చక్ర మోటార్ వాహనాలను (స్కూటీ లను) అందించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అని దివ్యాంగ సోదరులం ఏప్పుడు మా సంక్షేమం కోసం ఆలోచించే కేటీఆర్ గారి వెంటే ఉంటామని భావోద్వేగంతో మాట్లాడుతూ తమ అభిమానాన్ని తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ దార్ణం లక్ష్మీనారాయణ గారు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు దివ్యాంగ సోదరులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు