సిద్దిపేటలో కూలిన హెలీకాప్టర్

  సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ శివారులో ఓ హెలీ కాప్టర్‌ కూలిపోయింది. ల్యాండ్‌ అవుతున్న సమయంలో హెలీకాప్టర్‌లో మంటలు చెలరేగాయి. అయినప్పటికీ పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. పారాచూట్ల సాయంతో వారు కిందకు దిగి ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకోలిగారు. హకీంపేట నుంచి వస్తున్న ఈ శిక్షణా హెలీకాప్టర్‌ గాలిలోనే పేలినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్సనిమిత్తం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Continue Reading

రాజన్న జిల్లాకు రానున్న స్పెషలిటీ ఆసుపత్రి..?

★ సర్కారీ వైద్యం సూపర్‌ స్పెషల్‌! ★ 10 పాత జిల్లా కేంద్రాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ★ కొత్త జిల్లాల్లో స్పెషాలిటీ ఆస్పత్రులు ★ ఒకట్రెండు రోజుల్లో రానున్న జీవో ★ స్పెషాలిటీల్లో 16 రకాల సేవలు ★ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా ఆధునికీకరించాలని సంకల్పించింది. ఉమ్మడి పాత 10 జిల్లాల్లోని ఆస్పత్రులను సూపర్‌ స్పెషాలిటీ […]

Continue Reading

వెంకటాపూర్‌లో భూ సమగ్ర సర్వే ప్రారంభం..

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో బుధవారం అధికారులు భూ సమగ్ర సర్వేను ప్రారంభించారు. డిసెంబర్‌ 04వ తేదీ వరకు జరిగే ఈ సర్వేలో రైతులు ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యలు ఉన్న రైతులు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే వాటిని అక్కడికక్కడే పరిష్కరించనున్నట్లు తెలిపారు. చనిపోయిన పట్టాదారుల వారసులకు పట్టాలు చేయడం, ఆన్‌లైన్‌లో లేనివారి భూములను నమోదు చేయడం, పేర్ల సవరణ చేయడం […]

Continue Reading

హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక సాయం : ఎస్ పి విశ్వజిత్

రాజన్న సిరిసిల్ల జిల్లా లోని గంభీరావుపేట్ కి చెందిన బండ శ్రీనివాస్(35) HG-1262 గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు, అనారోగ్య కారణాల వల్ల 03-10-2017 న అకాల మరణం చెందాడు. అతనికి భార్య రుక్మిణి , ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయిన ఆ కుటుంబానికి SP  విశ్వజిత్  వెంటనే పలు ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు అందించారు.ఈ మధ్యన జిల్లాలో  ఏర్పాటు చేసిన హోంగార్డుల సంక్షేమ సహాయ నిధి నుండి […]

Continue Reading

ఖాళీ బిందెలతో మహిళల నిరసన

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలంలోని అక్కపల్లి గ్రామంలో సోమవారం మహిళలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. గత ఏడాదిగా నల్లాలు రాక మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని , తమ దయనీయ పరిస్థితిని గురించి ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. పలుమార్లు సర్పంచ్‌కు విన్నవించినా ఇప్పటి వరకు స్పందన లేదని, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు […]

Continue Reading

రాజన్నసిరిసిల్లజిల్లా అడిషనల్ ఎస్. పి (అడ్మిన్) గా P. రవీందర్ రావు..

రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ ఎస్. పి (అడ్మిన్) గా శ్రీ P. రవీందర్ రావు గారు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్ పి పూలగుచం ఇచ్చి అభినందించారు.

Continue Reading

ఇకపై ‘తెలుగు’ తప్పనిసరి

తెలంగాణలో ప్రతి విద్యార్థి తెలుగు చదివేలా తెలంగాణ ప్రభుత్వం త్వరలో చట్టం తీసుకురానుంది. తెలుగును తప్పనిసరి చేస్తూ తీసుకురానున్న చట్టాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు విద్యాశాఖ అధికారులు విధి విధానాలు రూపొందిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్‌ వరకు తెలుగు భాషను తప్పని సరి చేయడమే లక్ష్యంగా కేసీఆర్‌ సర్కార్‌ చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అంతేకాకుండా ఈ చట్టానికి సంబంధించిన విధి విధానాలను త్వరలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో […]

Continue Reading

పక్కా సమాచారంతో దొంగను పట్టుకున్న CCS పోలీసులు

రాజన్నసిరిసిల్ల జిల్లా లోని ఎల్లారెడ్డిపేట్ లో CCS SI ఉపేందర్ మరియు టౌన్ SI శేఖర్ ఆధ్వర్యంలో పక్కా సమాచారంతో గొట్టె అంజయ్య ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, సిరిసిల్ల పరిధిలో రెండు దొంగతనం నేరాలు పాల్పడ్డట్టు విచారణలో తేలింది, ఇతని వద్ద నుండి 3తులాల బంగారం మరియు 30 తులాల వెండి రికవరీ చేసారు, అంజయ్య గతంలో హైదరాబాద్, కామారెడ్డి మరియు దుబ్బాక ప్రాంతాలలో దొంగ నోట్ల కేసులో కూడా జైలు శిక్ష అనుభవించాడు, అంజయ్యని […]

Continue Reading

ట్రావెల్స్ పై జిల్లా టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడి..

రాజన్నసిరిసిల్ల జిల్లా లోని వేములవాడ పట్టణంలో జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేసారు, పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ సమీపంలో ఉన్న కమలాకర్ ట్రావెల్స్, ట్రావెల్స్ ముసుగులో నకిలీ గల్ఫ్ ఏజెంట్ దందా సాగిస్తున్న సమాచారంతో జిల్లా టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ తనిఖీలో పలు సర్టిఫికెట్లు మరియు పాస్ పోర్టులు స్వాధీనం చేసుకొని గల్ఫ్ ఏజెంట్ మల్లనేని కమలాకర్ పై ఇమిగ్రేషన్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసారు.

Continue Reading

రక్తదానం చేసి జిల్లా ప్రజల మనస్సు గెలిచిన ఎస్ పి

సంక్షేమ కార్యక్రమాలు లలో ముందు ఉండే సిరిసిల్ల జిల్లా SP శ్రీ విశ్వజిత్ కాంపాటి గారు మరోసారి జిల్లా ప్రజల మనస్సు గెలిచారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఈరోజు ఈరోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా స్థాయిలో రక్త దాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో 140 మంది పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి SP గారి చేతుల మీదుగా సెర్టిఫికెట్లు అందజేయడం జరిగింది. ముందుగా SP గారు, […]

Continue Reading