Foundation laid for Gokaldas images factory by Honorable minister KTR at Rajannasircilla district

భారతదేశంలో రెడీమేడ్‌ వస్త్రాల తయారీలో పేరుగాంచిన గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దూర్ ఆప్పరెల్ పార్కులో నిర్మించ తలపెట్టిన ఆప్పరెల్ ఫ్యాక్టరీకి మంత్రి శ్రీ కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ ఎండి సుమీర్ హిందూజా, చేనేత మరియు జౌళి శాఖ సంచాలకులు శైలజ రామయ్యర్, టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ మరియు ఎండి వి. నరసింహా రెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆప్పరెల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనుండగా, అందులో ఎక్కువ శాతం మహిళలు లబ్ధి పొందనున్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్ల‌లో ఆప్పరెల్ పార్కు ఉండాల‌నేది ఈ ప్రాంత ప్ర‌జ‌లు ఎప్పటి నుంచో క‌ల కంటున్నారు. 2005లో నాటి ప్రభుత్వం ఆప్పరెల్ పార్కు పెడుతామ‌ని హామీ ఇచ్చింది కానీ అమ‌లు చేయ‌లేదు. సీఎం శ్రీ కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవాళ దానికి బీజం ప‌డిందని అన్నారు. ఆప్పరెల్ పార్కులో రాబోయే రోజుల్లో 10 వేల మంది ఉపాధి పొందబోతున్నారని, అందులో 80 శాతానికి పైగా మ‌హిళ‌ల‌కే ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌న్నారు. బ‌తుక‌మ్మ చీర‌లు, గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ యూనిఫాం ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయన్నారు. దీంతో నేత‌న్న‌ల ఆదాయం పెరిగింది అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *