Inauguration of PLANT AMBULANCE by Collector Krishna Bhaskar and Municipal Chairman Jindam Kala Chakrapani at Sricilla
గౌరవ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్లాంట్ అంబులెన్స్ ను ప్రారంభించి…. ముక్కోటి వృక్ష అర్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి.. లక్ష మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈరోజు తెలంగాణకు హరిత హారంలో భాగంగా పురపాలక సంఘ పరిధి లోని విలీన గ్రామం అయినటువంటి 12వ వార్డ్ చంద్రంపేట లో లక్ష మొక్కల పంపిణీ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమాలతో పాటు మొక్కలు సంరక్షణ కొరకు ప్లాంట్ అంబులెన్స్ ను కూడా గౌరవ జిల్లా కలెక్టర్ మరియు పురపాలక సంఘ చైర్ పర్సన్ గార్ల చే ప్రారంభించుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మునిసిపల్ కమీషనర్ గారు మాట్లాడుతూ ఈరోజు ప్రారంభించిన ప్లాంట్ అంబులెన్స్ ను పూర్తిగా మొక్కల సంరక్షణకు మాత్రమే ఉపయోగించబడును అని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరిస్తూ సిరిసిల్ల పురపాలక సంఘ పరిధిలో నాటిన మొక్కలు సంరక్షించుటకు మరియు క్యాజువాలిటీ రిప్లేస్మెంట్ (చనిపోయిన లేదా వాడి పోయిన మొక్కలు మార్చుటకు గాను) గాను వినూత్న పద్దతిలో సిరిసిల్ల పురపాలక సంఘం “ప్లాంట్ అంబులెన్స్ “ ఏర్పాటు చేయడం జరిగినది, ఇట్టి అంబులెన్స్ లో ట్రీ గార్డ్స్, సపోర్ట్ స్టిక్స్, ఎరువులు , పారలు, తట్టలు, మొదలగు పరికరాలు ఏర్పాటు చేయనైనది అలాగే వాటర్ సౌకర్యము కలదు. ఇట్టి అంబులెన్స్ ముఖ్య ఉద్దేశ్యం పట్టణంలోని వివిధ వార్డులలోని చని పోయిన మొక్కల స్థానంలో క్రొత్త మొక్కలు ఏర్పాటు, మొక్కలకు పాదులు చేయుట, ట్రీ గార్డ్స్ లేని చోట ట్రీ గార్డ్స్ ఏర్పాటు, పెరిగిన చెట్లకు ట్రీ గార్డ్స్ ను తొలగించుట, గుబురుగా పెరిగిన మొక్కలను ట్రిమ్మింగ్ చేయుట, ఎరువులు వేయుట మొదలగు పనులు చేయబడును అని తెలియజేశారు.మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కావున పట్టణ ప్రజలు మొక్కల విషయమై ఎలాంటి ఫిర్యాదులు అనగా మీ యొక్క వార్డులలోని ఎవైన మొక్కలు చెడిపోయిన, గుబురుగా పెరిగిన, ట్రీ గార్డ్స్ లేకున్నా కావున, పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా మీ యొక్క వార్డులలోని ఎవైన మొక్కలు చెడిపోయిన, గుబురుగా పెరిగిన, ట్రీ గార్డ్స్ లేకున్నా మా యొక్క అంబులెన్స్ నెంబర్ 08723-233040 కి కాల్ చేస్తే మా యొక్క అంబులెన్స్ టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉండగలరు దీనికి గాను అంబులెన్స్ టీం లో ఒక డ్రైవర్ మరియు నలుగురు వర్కర్ లను నియమించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారు,స్ధానిక సంస్థల ఆడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ గారు, చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి గారు,వైస్ ఛైర్మన్ మంచే శ్రీనివాస్ గారు, స్థానిక కౌన్సిలర్స్ పాతూరి రాజిరెడ్డి గారు, పోచవేని సత్య-ఎల్లయ్య గారు,కౌన్సిల్ సభ్యులు,కో ఆప్షన్ సభ్యులు, స్థానిక ప్రజలు, మెప్మా సిబ్బంది మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు