కొత్త కోర్సుల పేరుతో పాత విద్యా విధానం కు తూట్లు.
కొత్త కోర్సుల పేరుతో పాత విద్యా విధానం కు తూట్లు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగాళ్లపల్లి మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాల లో చదువుతున్న విద్యార్థినిల భవిష్యత్తు ను అంధకారం లో నెట్టివేస్తున్న తెలంగాణ సర్కారు,నూతన విద్యా విధానాన్ని శ్రీకారం చుట్టి పాత బీఏ, బీకాం,బిఎస్సి విద్యను దూరం చేస్తున్న సర్కారు.
ఇక మీదట గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు చదవకుండా, ఉన్నత స్థాయికి ఎదగడానికి వీలు లేకుండా ఇప్పటి వరకు ఈ సంవత్సరం విద్య విధానంపై నోటిఫికేషన్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ,వాటి స్తానం లో నూతన విద్య విధానం ను ప్రవేశ పెట్టడం లో ఆంతర్యం ఏమిటి,అన్ని వర్గాలకు సంబందించిన మేధావులు ఆలోచించాలి.
నూతన విద్య విధానాన్ని స్వాగతిస్తున్నాము,ఆలాగే పాత కోర్సుల తో కూడా విద్యను కొనసాగించాలని కోరుతున్నాము,
గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తా0 అనే మీ కుట్రను సహించేది లేదు అని హెచ్చరిస్తున్నాము,
గిరిజన మహిళ డిగ్రీ కళాశాలకు పక్కా భవనం నిర్మాణం చేపట్టి పాత కోర్సుల విధానం లోనే కొనసాగింపు చేస్తూ,నూతన విద్యా విధానం కొనసాగించాలి అని డిమాండ్ చేస్తు AO గారికి వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమం ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ sfd కన్వీనర్ సమానపల్లి ప్రశాంత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కం నాగరాజు మోతుకూ వినయ్ టెక్కు మధు లోప్పల్లి రాజు చర్లపల్లి ప్రణయ్ కాసారపు బబ్లు పవన్ అజయ్ ప్రశాంత్ ఆనంద్ నర్సింహా విర్ పాల్గొన్నారు