మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కళ చక్రపాణి

ఈరోజు మునిసిపల్ కార్యాలయం లో కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో గౌరవ పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కళ చక్రపాణి గారి చేతుల మీదగా మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .
ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి గారు మాట్లాడుతూ వినాయక విగ్రహాలు నెలకొల్పే భక్తులందరూ సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తొందరగా నీటిలో విలీనం అవ్వకుండ పర్యావరణానికి హాని జరిగే అవకాశం ఉంది అని అన్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ అదేవిధంగా పర్యావరణం ను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు..
కాబట్టి సాధ్యమైనంత వరకు భక్తులు మట్టి విగ్రహాలను సహజ రంగులని వాడిన వినాయక విగ్రహాల ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని కోరుతున్నాను అని అన్నారు ..
అలాగే సిరిసిల్ల పట్టణ ప్రజల అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య గారు
వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ గారు ,కాలుష్య నియంత్రణ మండలి ప్రతినిధులు మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు